News November 12, 2025

బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి?

image

బాల్య వివాహాలు ముందు నుంచే లేవు. క్రీస్తు పూర్వం 4 సంవత్సరం నుంచి ఇవి మొదలయ్యాయి. బొమ్మల పెళ్లిళ్లు వీటికి దోహదం చేశాయి. పరదేశీయులు దండయాత్రల్లో తమకు చిక్కిన ఆడపిల్లలను చెరిపేవారు. ఇలాంటి దుస్థితి రాకూడదని తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేసి అత్తారిండ్లకు పంపేవారు. అయితే ఈ సంస్కృతి కారణంగానే ఆడపిల్లలు వేదాలు చదవడం, విద్యను అభ్యసించడం నిషిద్ధం అనే దుష్ప్రచారం మొదలైంది. <<-se>>#Pendli<<>>

Similar News

News November 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 64

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని గురువైన పరశురాముడు ఎలా గుర్తించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 12, 2025

టుడే..

image

* AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ
* కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
* TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ, రేపు <<18194401>>స్పీకర్<<>> విచారణ
* మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి
* వేములవాడ ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత

News November 12, 2025

బీసీ జనగణన తర్వాతే లోకల్ ఎలక్షన్స్.. హైకోర్టులో పిల్

image

AP: బీసీ జనగణన, వర్గీకరణ పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇదే నియమాన్ని బీసీలకు పాటించడం లేదు. 1986 తర్వాత బీసీ జనగణన జరగలేదు’ అని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేయనుంది.