News November 12, 2025
VKB: ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

ప్రజల భద్రత కోసమే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలలో డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉంటే 100కు డయల్ చేయాలన్నారు.
Similar News
News November 12, 2025
సెలవుల కోసం ఇంటికి వచ్చి తల్లి, కొడుకు మృత్యువాత

రేణిగుంట(M) కుక్కలదొడ్డి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతులు కర్నూలుకు చెందిన KN చంద్రభాను సింగ్(37), ఆయన తల్లి సరస్వతీ బాయి(63)గా గుర్తించారు. చంద్రభాను సింగ్ చైన్నైలో పని చేస్తున్నారు. ఆయన భార్య శ్రీదివ్య అక్కడే ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగి. సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చారు. అనంతరం తల్లి, కూతురితో కారులో చైన్నై బయలుదేరారు. లారీ ఢీకొట్టడంతో కొడుకు, తల్లి మృతిచెందారు.
News November 12, 2025
ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News November 12, 2025
శ్రీకాళహస్తిలో రాగి శాసనం

విజయనగర రాజు శ్రీరంగరాయ కాలం నాటి ఐదు పత్రాలతో కూడిన రాగి పలక శాసనం శ్రీకాళహస్తిలోని డాక్టర్ పరుశురాం గురుకుల్ ఆధీనంలో ఉంది. ఇందులో సంస్కృత భాషతో పాటు నందినాగరి అక్షరాలతో రాయబడి 1498 శకం, ధాత్రి, కార్తిక, షు 12 = 1576 C.E., నవంబర్ 3, శనివారంగా ఉంది. దీన్ని ఆర్కియాలజీ శాఖ అధికారి మునిరత్నం రెడ్డి వివరాలు వెల్లడించారు.


