News November 12, 2025

నేడు కర్నూలుకు గవర్నర్ రాక

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Similar News

News November 12, 2025

HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

image

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.

సిద్దిపేట: యువ వ్యాపారవేత్త సూసైడ్

image

అప్పుల భారాన్ని తట్టుకోలేక యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని మోతేలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాజు (35) జీవనోపాధి కోసం దుబ్బాకలో బ్యాంగిల్ స్టోర్ నడుపుతున్నాడు. భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. మంగళవారం మోతే గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.