News November 12, 2025
‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Similar News
News November 12, 2025
ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి ఇతడే..!

ఫరీదాబాద్ ఉగ్రమూలాల కేసులో ప్రధాన సూత్రధారి ఇటీవల జమ్మూలో అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనని తేలింది. జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా.ముజమ్మిల్, డా.షాహిన్ ఇతడి కంట్రోల్‌లోనే ఉన్నట్లు సమాచారం.
News November 12, 2025
గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్‌లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.


