News November 12, 2025

NZB: డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్షల ఫీజులు చెల్లించని డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 వరకు రూ.100 అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లింపుల పత్రాలను ఈ నెల 15 లోపు యూనివర్సిటీలో అందజేయాలని ఆయన సూచించారు.

Similar News

News November 12, 2025

HYD: టీజీ సెట్-2025 డిసెంబర్ 10 నుంచి ప్రారంభం

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2025) డిసెంబర్ 10, 11, 12వ తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ అర్హత కోసం ఈ పరీక్షను 29 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 3 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

News November 12, 2025

రాజన్న దర్శనాలు మరోవారమైన కొనసాగించాల్సింది..!

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలు ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో వారంలో పూర్తికానుంది. భక్తులు కార్తీక దీపారాధన చేసుకోవడానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రాజన్న దర్శనాలు మరో వారం పాటు కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు.

News November 12, 2025

ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి ఇతడే..!

image

ఫరీదాబాద్ ఉగ్రమూలాల కేసులో ప్రధాన సూత్రధారి ఇటీవల జమ్మూలో అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనని తేలింది. జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా.ముజమ్మిల్, డా.షాహిన్ ఇతడి కంట్రోల్‌లోనే ఉన్నట్లు సమాచారం.