News November 12, 2025

ముక్కిడిగుండం: అటవీ అధికారులపై గిరిజనుల దాడి

image

ముక్కిడిగుండం గ్రామంలో అటవీభూమిలో చెట్లను నరికుతున్న గిరిజనులను అడ్డుకునే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది. వత్తిమక్కులకుంట దగ్గర సుమారు 15 ఎకరాల అటవీ భూమిలో చెట్లు నరికుతున్నారని సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారి జయరాం అక్కడికి చేరుకోగా, అతనిపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని దాడిచేసిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 12, 2025

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 12, 2025

VKB: గురుకులంలో లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ బూరుగుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, PET, ఆంగ్లంలో బోధించేందుకు MSc, BEd, తెలుగు MA BED, PET బి.పేడ్ అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ Ch.ఉషాకిరణ్ తెలిపారు. నవంబర్ 13లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.

News November 12, 2025

కిడ్నీలు దొంగిలించే ముఠాలో ప్రధానమైనవారు వీరే.!

image

కిడ్నీలు దొంగిలించే రాకెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న పెళ్లి పద్మ – కాకర్ల సత్య, వెంకటేశ్వర్ల కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం ఏడాది కాలంగా సాగుతున్నట్లు సమాచారం. బాంబేకి చెందిన ఓ మహిళా డాక్టర్ మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్‌కు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోందని తెలిసింది.