News November 12, 2025

మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

image

‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.

Similar News

News November 12, 2025

తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

image

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.

News November 12, 2025

హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

image

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.

News November 12, 2025

భీష్ముడిని, ధర్మరాజు ఏం అడిగాడంటే?

image

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
భావం: అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? దేనిని జపిస్తే జీవులు జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు? అని ధర్మరాజు, భీష్ముడిని అడిగారు. మోక్ష సాధన మార్గాన్ని, సర్వ శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గాన్ని తెలుసుకోవాలనే ధర్మరాజు జ్ఞాన జిజ్ఞాస ఈ ప్రశ్నలలో వ్యక్తమవుతోంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>