News November 12, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

image

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.

Similar News

News November 12, 2025

HYD: టీజీ సెట్-2025 డిసెంబర్ 10 నుంచి ప్రారంభం

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2025) డిసెంబర్ 10, 11, 12వ తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ అర్హత కోసం ఈ పరీక్షను 29 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 3 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

News November 12, 2025

HYD: పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డి అరెస్ట్

image

HYDలోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డిని SFIO అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్‌లో ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ డాక్యుమెంట్ల, సంతకాలతో సంస్థకు చెందిన 100 ఎకరాల భూమి (విలువ రూ.300 కోట్లు)ను విక్రయించినట్లు ఆరోపించారు. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై చర్య తీసుకున్న అధికారులు రమేశ్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

News November 12, 2025

HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

image

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.