News November 12, 2025
అల్లూరి జిల్లాలో 11,598 గృహాలు ప్రారంభం

అల్లూరి జిల్లాలో నేడు 11,598 గృహాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పాడేరు నియోజకవర్గంలో సప్పిపుట్టు, అరకు నియోజకవర్గంలో సిమిలిగూడ, రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగలలో నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 12, 2025
ASF: ‘కిసాన్ కాపాస్ యాప్‌ని రద్దుచేయాలి’

సీసీఐ నిబంధనలను సడలించి, కిసాన్ కాపాస్ యాప్‌ని రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతీ అన్నారు. జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం ఇచ్చారు. తేమ పరీక్ష లేకుండా ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి వాతావరణ దుష్ప్రభావం దండిగానే పడిందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి చెట్లకు ఖాతా, పూత విపరీతంగా రాలిపోయి పంట కేవలం 20% నుంచి 30% మాత్రమే దిగుబడి వచ్చేలా ఉందన్నారు.
News November 12, 2025
ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో రూ. 14 కోట్లు దోపిడీ

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలు హడలెత్తిస్తున్నాయి. గత 10 నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 330కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు జిల్లా వాసుల నుంచి ఏకంగా రూ. 14 కోట్లు దోచుకున్నారు. నష్టపోయిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడంతో రూ. 4 కోట్లు రికవరీ అయింది. కొరియర్ వచ్చిందంటూ ఓటీపీ చెప్పించడం ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయి.
News November 12, 2025
నిర్మల్: 14న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఈనెల 14న ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సమావేశం నిర్వహించే విద్యార్థుల ప్రగతిని వారికి వివరించాలన్నారు.


