News November 12, 2025
ఎల్ఈడీ తెరపై వేములవాడ రాజన్న దర్శనం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈరోజు నుంచి ఎల్ఈడీ తెరపై రాజన్నను దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆలయ ముందు భాగంలో టెంట్ కింద శ్రీ స్వామివారి ప్రచార రథం, ఎల్ఈడీ తెర ఏర్పాటు చేశారు. భక్తులు ప్రచారరథంలో ఉత్సవ విగ్రహాలను మొక్కుకొని ఎల్ఈడీ తెరపై గర్భాలయంలోని శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు.
Similar News
News November 12, 2025
ఊర్కొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా ఊర్కొండలో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 15.2, బిజినపల్లి, తెలకపల్లిలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి, అమ్రాబాద్ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?