News November 12, 2025
జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్ వార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?
Similar News
News November 12, 2025
కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బొమ్మన్‌దేవిపల్లి 12°C, నస్రుల్లాబాద్ 12.1, లచ్చపేట 12.4, ఎల్పుగొండ 12.5, సర్వాపూర్ 12.6, గాంధారి,రామలక్ష్మణపల్లి,డోంగ్లి లలో 12.7, బీర్కూర్ 12.9, రామారెడ్డి, మేనూర్‌లలో 13, జుక్కల్, బీబీపేట, ఇసాయిపేటలో 13.1, లింగంపేట, భిక్కనూర్‌లో 13.3, పుల్కల్ 13.5°C లుగా నమోదయ్యాయి.
News November 12, 2025
నేటి నుంచి MGMలో స్పెషల్ సదరం క్యాంపులు

నేటి నుంచి ఈ నెల 15 వరకు ఎంజీఎంలో స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మీసేవ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న 1,280 మందికి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న ఫారంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.


