News November 12, 2025
మంచిర్యాల: ఈనెల 16న రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీలు

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సేవ భవన్‌లో ఈనెల 16న తెలంగాణ రాష్ట్ర స్థాయి ‘ఓపెన్ టూ ఆల్’ కరాటే, కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పోచంపల్లి వెంకటేష్, పెద్దపల్లి మహేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ధ్రువపత్రాలతో సకాలంలో హాజరుకావాలని వారు కోరారు. రాష్ట్రస్థాయి పోరాట పటిమను ప్రదర్శించేందుకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలన్నారు.
Similar News
News November 12, 2025
సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<
News November 12, 2025
అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


