News November 12, 2025
HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.
Similar News
News November 12, 2025
పెద్దపల్లి: ‘17% లోపు తేమతోనే ధాన్యం తీసుకురావాలి’

రైతులు వరి ధాన్యాన్ని 17%లోపు తేమ వచ్చాక మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పొలంనుంచి నేరుగా కాకుండా ముందుగా బాగా ఆరబెట్టాలని, రాత్రిపూట ప్లాస్టిక్ కవర్లు కప్పి తేమ పెరగకుండా చూడాలని చెప్పారు. నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే అదే రోజు కాంటా వేసి మిల్లులకు తరలిస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సూచనలు పాటించాలని కోరారు.
News November 12, 2025
హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్‌లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.
News November 12, 2025
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చోడవరం తరలింపు

వడ్డాదిలో <<18264743>>పిచ్చికుక్క <<>>దాడితో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చోడవరం CHCకి తరలించినట్లు డాక్టర్ రమ్య తెలిపారు. వడ్డాది PHCలో రేబీస్ వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్స అనంతరం బాధితులను తరలించామన్నారు. కాగా పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారి సంఖ్య 15కి చేరుకుంది. గాయపడిన వారు ఒక్కొక్కరు ఆసుపత్రికి వస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


