News November 12, 2025

బీజాపూర్ అడవుల్లో కాల్పుల మోత!

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతాల్లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడ్ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జితో బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ పోలీసులు ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.

Similar News

News November 12, 2025

దారుణం.. ఉల్లి ధర కేజీ రూపాయి

image

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. మాల్వాలో నిన్న KG ఆనియన్ ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్‌సౌర్‌లో రూపాయికి పతనమైంది. భారీగా ఉల్లి నిల్వలు ఉండగా కొత్త పంట మార్కెట్‌లో రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. 30 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు ₹2K చెల్లిస్తే.. క్వింటాల్‌కు ₹250 వచ్చిందని రత్లాం మార్కెట్‌లో మొఫత్‌లాల్ అనే రైతు వాపోయారు. ఉల్లికి MSP కల్పించాలని కోరుతున్నారు.

News November 12, 2025

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: CM

image

AP: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ లక్ష్యమని CM చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి దీనిని సాకారమయ్యేలా చూస్తామన్నారు. అన్నమయ్య(D) దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. YCP హయాంలో 4 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేశారని, ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.900కోట్లను ఎగ్గొట్టారని విమర్శించారు.

News November 12, 2025

సోషల్ మీడియా అకౌంట్లకు తల్లిదండ్రుల అనుమతి

image

మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చెయ్యడానికి వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్‌ కన్‌సెంట్‌) ఉండాలని కేంద్ర సమాచారశాఖ విడుదల చేసిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (DPDP) చట్టముసాయిదాలో నిబంధన చేర్చారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లిదండ్రులు/ గార్డియన్‌ అనుమతి ఉంటేనే మైనర్లు సోషల్‌ మీడియా, ఈ-కామర్స్, గేమింగ్‌ యాప్‌లు వాడాలి. దివ్యాంగులకు కూడా గార్డియన్ సమ్మతి ఉండాలని చెబుతున్నారు.