News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?
Similar News
News November 12, 2025
HYD: రెండేళ్లలో 400 క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు..!

HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. క్యాన్సర్ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాల్లో ఏకంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీల ద్వారా అతి సులువుగా, రోగికి ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా వైద్య బృందం వెల్లడించింది. MNJ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు వరంగా మారుతోంది.
News November 12, 2025
HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.
News November 12, 2025
HYD: 15 ఏళ్లు దాటితే తుక్కుగా మార్చాలి.. RTC సమాలోచన!

కేంద్ర ప్రభుత్వ పాలసీ ద్వారా 15 ఏళ్లు దాటిన ఆర్టీసీ డీజిల్ బస్సులను తుక్కుగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో HYD రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా అధికారులు తెలియజేశారు. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడంపై సైతం సమాలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు వివరించారు.


