News November 12, 2025

HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

image

రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్‌ పాన్‌మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.

Similar News

News November 12, 2025

రైలు ఢీకొని ఏల్చూరు మహిళ మృతి

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కూరగాయల మార్కెట్ సమీపాన రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సమాచారం మేరకు సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన పోలిశెట్టి మహాలక్ష్మి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 12, 2025

KMR: వైద్య వృత్తిలో సేవా భావంతో పనిచేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సర 100 మంది విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.

News November 12, 2025

అభివృద్ధి ప‌థంలో ప‌ర్యాట‌క రంగం కీల‌కం: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి స‌మ్మిళిత‌, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా అన్నారు. క‌లెక్ట‌ర్ బుధ‌వారం ట్రెయినీ ఐఏఎస్ అధికారుల‌తో క‌లిసి కొండ‌ప‌ల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్ర‌క వైభ‌వాన్ని వివ‌రించారు. కొండ‌ప‌ల్లి కోట‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు చొర‌వ తీసుకుంటున్నామ‌ని వివరించారు.