News November 12, 2025
GHMC వ్యాప్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం

గ్రేటర్ HYD వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం ఆవిష్కరించింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను అధికారులకు అందించినప్పుడు వాటిని గతంలో నమోదు చేయకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు వాటన్నింటి వివరాలు నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిస్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు.
Similar News
News November 12, 2025
మేడారం జాతరపై మంత్రుల సమీక్ష

మేడారం మహా జాతర పనులపై తాడ్వాయి హరిత హోటల్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ సమీక్షించారు. జాతర ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.
News November 12, 2025
వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రక్షణ వలయం

వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి పడమర, ఉత్తరం వైపు రేకులతో ఫెన్సింగ్ వేసి మూసివేశారు. తాజాగా, దక్షిణం వైపుగల పాత ఆంధ్రబ్యాంక్ రోడ్డులో కూడా ఇనుప చువ్వలు పాతి, ఎత్తైన రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు వైపు కూడా ఫెన్సింగ్ పూర్తయిన అనంతరం ఆలయంలో పూర్తిస్థాయి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు.
News November 12, 2025
సంగారెడ్డి: 12 నుంచి వయో వృద్ధుల వారోత్సవాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 12 నుంచి 19 తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. సంగారెడ్డి కార్యాలయంలో పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడితే, వృద్ధుల సంక్షేమం కోసం 14567 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.


