News November 12, 2025
హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్‌లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.
Similar News
News November 12, 2025
మేడారం జాతరపై మంత్రుల సమీక్ష

మేడారం మహా జాతర పనులపై తాడ్వాయి హరిత హోటల్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ సమీక్షించారు. జాతర ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.
News November 12, 2025
వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రక్షణ వలయం

వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి పడమర, ఉత్తరం వైపు రేకులతో ఫెన్సింగ్ వేసి మూసివేశారు. తాజాగా, దక్షిణం వైపుగల పాత ఆంధ్రబ్యాంక్ రోడ్డులో కూడా ఇనుప చువ్వలు పాతి, ఎత్తైన రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు వైపు కూడా ఫెన్సింగ్ పూర్తయిన అనంతరం ఆలయంలో పూర్తిస్థాయి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు.
News November 12, 2025
సంగారెడ్డి: 12 నుంచి వయో వృద్ధుల వారోత్సవాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 12 నుంచి 19 తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. సంగారెడ్డి కార్యాలయంలో పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడితే, వృద్ధుల సంక్షేమం కోసం 14567 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.


