News November 12, 2025
సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్!

టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇన్‌డైరెక్ట్‌గా చెక్ పెట్టారు. ‘తండ్రి అయ్యాకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. అంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు. నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలని డిసైడయ్యా’ అని పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.
News November 12, 2025
రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
News November 12, 2025
రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు: PCC చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందన్న BRS ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ‘రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. BRS వాళ్లు ఓడిపోతున్నామనే బాధలో మాట్లాడుతున్నారు. మళ్లీ మేమే వస్తాం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.


