News November 12, 2025
చిన్నమండెం: CM సభలో మాట్లాడిన మహిళ

అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో బుధవారం CM చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా కొందరు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలు మాట్లాడారు. అంజనమ్మ మాట్లాడుతూ.. తన భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, అధిక అద్దెలతో ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇంట్లో సంతోషంగా ఉంటామని చెప్పుకొచ్చారు. తమ సొంతింటి కలను CM నిజం చేశారన్నారు.
Similar News
News November 12, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: MHBD కలెక్టర్

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఈమేరకు నెల్లికుదురు మండలకేంద్రం, రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను వారు సందర్శించారు. అదేవిధంగా మండలంలోని కేజీబీవీ పాఠశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News November 12, 2025
ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.
News November 12, 2025
రోహిత్ టార్గెట్.. ఫిట్‌నెస్, 2027 వరల్డ్ కప్!

2027 ODI వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని రోహిత్ శర్మ గట్టి పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడనున్నట్టు ప్రకటించడం అందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పక ఆడాల్సిందేనని BCCI రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.


