News November 12, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.
Similar News
News November 12, 2025
ఢిల్లీ పేలుడు.. అల్ ఫలాహ్‌లో మరో డాక్టర్ మిస్సింగ్?

ఢిల్లీ <<18253549>>పేలుడు<<>>కు సంబంధించి అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన మరో డాక్టర్ పేరు బయటికొచ్చింది. బ్లాస్ట్ తర్వాత డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇతడు గతంలో కశ్మీర్‌లోని SMHS ఆస్పత్రిలో పని చేశాడు. అయితే టెర్రర్ లింక్స్ ఉన్నాయనే అనుమానంతో 2023లో J&K లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించడం గమనార్హం. ఆ సమయంలో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అల్ ఫలాహ్ వర్సిటీలో నిసార్ జాయిన్ అయ్యాడు.
News November 12, 2025
రేపు 9AMకి బిగ్ అనౌన్స్‌మెంట్: లోకేశ్

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను ఆపేసింది. మళ్లీ తుఫాను మాదిరిగా ఏపీకి రాబోతోంది. రేపు ఉ.9 గం.కు పెద్ద ప్రకటన చేస్తాం. రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. మరోవైపు CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై లోకేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
News November 12, 2025
సివిల్స్ అభ్యర్థులకు త్వరలో రూ.లక్ష చొప్పున సాయం

TG: సివిల్స్ అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద లబ్ధి పొందిన వారిలో 43 మంది అభ్యర్థులు తాజాగా UPSC సివిల్స్ <<18265046>>ఫలితాల్లో<<>> ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సింగరేణి CSR ప్రోగ్రామ్‌లో భాగంగా వీరికి CM రేవంత్ త్వరలో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


