News November 12, 2025
MHBD: ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామ యాత్ర

MHBD డిపో నుంచి ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 16న పంచారామ యాత్ర టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గంటలకు బయలుదేరి, ఐదు పంచారామాల(అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట)ను సందర్శించి 18న తిరిగి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,700 చొప్పున ధర నిర్ణయించినట్లు చెప్పారు.
Similar News
News November 12, 2025
అండ దానం గురించి తెలుసా?

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్ చేయాలి.
News November 12, 2025
చింతూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చింతూరు (M) తుమ్మలలో బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు SI రమేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చింతూరు-భద్రాచలం వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా శివకృష్ణ మృతి చెందాడు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చెరువుపల్లికి చెందిన శివకృష్ణగా గుర్తించారు.
News November 12, 2025
విద్యార్థిని అభినందించిన మంత్రి దుర్గేష్

నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ..కుంచాల కైవల్య రెడ్డిని అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో బుధవారం కలిశారు.


