News November 12, 2025

సంగారెడ్డి: 12 నుంచి వయో వృద్ధుల వారోత్సవాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 12 నుంచి 19 తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. సంగారెడ్డి కార్యాలయంలో పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడితే, వృద్ధుల సంక్షేమం కోసం 14567 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.

Similar News

News November 12, 2025

విజయవాడ: రోగులు ఫుల్.. సిబ్బంది నిల్..!

image

విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగలకు కలిపి 85 మంజూరు పోస్టులు ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి రోగులు అనేక మంది వస్తున్నారని, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మరి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు వస్తున్నారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.

News November 12, 2025

HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPCC

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.

News November 12, 2025

విశాఖ సీఐఐ సమ్మిట్ సమన్వయానికి ఇద్దరు కలెక్టర్లు

image

విశాఖలో ఈనెల 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను సమర్థవంతంగా సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ , నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాలను ఈ బాధ్యతలకు డిప్యూట్‌ చేసింది. వీరిద్దరూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్‌.యువరాజ్‌ కు రిపోర్ట్‌ చేయనున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు.