News November 12, 2025
భీమేశ్వరస్వామి ఆలయంలోనే మొక్కులు: ఈవో

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగవంతం అయిన నేపథ్యంలో భక్తులు తమ మొక్కులను భీమేశ్వరస్వామి ఆలయంలోనే చెల్లించుకోవాలని ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా, శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతీ మహాస్వామి ఆజ్ఞానుసారం భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని ఈవో కోరారు.
Similar News
News November 12, 2025
విజయవాడ: రోగులు ఫుల్.. సిబ్బంది నిల్..!

విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగలకు కలిపి 85 మంజూరు పోస్టులు ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి రోగులు అనేక మంది వస్తున్నారని, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మరి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు వస్తున్నారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.
News November 12, 2025
HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPCC

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.
News November 12, 2025
విశాఖ సీఐఐ సమ్మిట్ సమన్వయానికి ఇద్దరు కలెక్టర్లు

విశాఖలో ఈనెల 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను సమర్థవంతంగా సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించింది. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ , నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాలను ఈ బాధ్యతలకు డిప్యూట్ చేసింది. వీరిద్దరూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ కు రిపోర్ట్ చేయనున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు.


