News November 12, 2025

దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకురావాలి: కలెక్టర్

image

భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకురావాలని మహదేవపూర్ తహశీల్దార్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు. భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు.

Similar News

News November 12, 2025

భారత్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

image

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News November 12, 2025

MBNR: ఖో-ఖో ఎంపికలకు 150 మంది హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్‌లో అండర్-19 ఖో-ఖో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎంపికల్లో పీడీలు వేణుగోపాల్, మోగులాల్, దూమర్ల నిరంజన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2025

‘పోలీస్ ఉద్యోగి సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్ చేయాలి’

image

పోలీస్ ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగవంతంగా ఆన్‌లైన్ చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన ఈఎస్ఎం ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈనల 30 నాటికి ప్రతి పోలీస్ ఉద్యోగి పూర్తి వివరాలు ఈఎస్ఎం (ఎంప్లాయీ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో పొందుపరచాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే సిబ్బంది తమ వివరాలను స్వయంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు.