News November 12, 2025
కరీంనగర్: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందిని ఉమ్మడి కరీంనగర్ ACB డీఎస్‌పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లంచం అడగడం.. లంచం తీసుకోవడం.. లంచం ఇవ్వడం కూడా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
Similar News
News November 12, 2025
కరీంనగర్: ఏసీబీ రైడ్‌లో నమోదైన కేసుల వివరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025లో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ-8, పంచాయితీ రాజ్-6, రిజిస్ట్రేషన్-3, ఖజానా-3, మున్సిపల్-3, అగ్రికల్చర్-3, ఔషధ విభాగం-3, ఆర్టీఏ-3, పోలీస్-1 రెడ్ హ్యాండెడ్‌గో పట్టుకున్నామన్నారు. 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News November 12, 2025
స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి: కలెక్టర్

జిల్లాలో అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.
News November 12, 2025
అలర్ట్.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!

TG: రాబోయే వారం రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉందని తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, 5 ఏళ్ల లోపు పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


