News November 12, 2025

HNK: ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

image

HNK జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2025-26 విద్యా సం.నికి రూ.4000 ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలను తమ కార్యాలయంలో అందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యం.నరసింహ స్వామి తెలిపారు.

Similar News

News November 12, 2025

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

కొవ్వూరు మండలం అరికిరేవుల వద్ద బుధవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరంలోని పిడుగుకు చెందిన వెంకటరమణ(50) మరణించారని సీఐ విశ్వ తెలిపారు. బైక్‌పై కొవ్వూరు నుంచి తాళ్లపూడికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

image

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.

News November 12, 2025

భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: ధర్మారెడ్డి

image

సిట్ అధికారులు విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించానని TTD మాజీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో TTDలో భాధ్యతలు నిర్వర్తించిన అందరూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నన్ను విచారించారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు. వీటితో ప్రజలను పక్కదారి పట్టించవద్దు. భక్తుల మనోభావాలను దెబ్బతీయ వద్దు’ అని ధర్మారెడ్డి కోరారు.