News November 12, 2025

వరంగల్: జనజాతీయ గౌరవ్ దివాస్ ప్రత్యేక గ్రామసభలు

image

ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పీవో చిత్రామిశ్రా తెలిపారు. ఈనెల 13న ఉమ్మడి జిల్లాలోని 49 ఆదిసేవ కేంద్రాలలో ప్రత్యేక గ్రామసభలు ఉంటాయన్నారు. ఈ జన్ సున్వాయ్ సెషన్‌లో గ్రామాల్లోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారన్నారు. 15న బిర్సాముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పీవో పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

జగిత్యాల: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం నాచుపెల్లి JNTU కళాశాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కొడిమ్యాల, మల్యాల మండలాల రైస్ మిల్లర్లు, రైతులతో ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు.

News November 12, 2025

శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

image

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.

News November 12, 2025

ఇంటింటికి వెళ్లి అవగాహన: కలెక్టర్

image

కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లాలో కుష్టు వ్యాధి కేసులను గుర్తించేందుకు ఈనెల 17 నుంచి 30 వరకు ఎల్.సీ.డీ.సీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వద్ద గోడపత్రిక ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యారోగ్యశాఖ సిబ్బంది సర్వే నిర్వహిస్తారన్నారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారన్నారు.