News November 12, 2025
‘పోలీస్ ఉద్యోగి సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్ చేయాలి’

పోలీస్ ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగవంతంగా ఆన్‌లైన్ చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన ఈఎస్ఎం ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈనల 30 నాటికి ప్రతి పోలీస్ ఉద్యోగి పూర్తి వివరాలు ఈఎస్ఎం (ఎంప్లాయీ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో పొందుపరచాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే సిబ్బంది తమ వివరాలను స్వయంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు.
Similar News
News November 12, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ బూర్గంపాడు రోడ్డు అధ్వానం.. మార్గమధ్యంలో ప్రసవం
✓ పాల్వంచ: ప్రిన్సిపల్ ప్రాక్టికల్ బోధన.. సర్వత్ర విమర్శలు
✓ చర్ల: మనస్థాపానికి గురై ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
✓ పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద పోలీసుల నాకాబంది
✓ జూలూరుపాడు ఠాణాను తనిఖీ చేసిన ఎస్పీ
✓ జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరడం ఖాయం: రేగా
✓ కొత్తగూడెం: దళారులను అరికట్టేందుకే ‘కపాస్ కిసాన్’
✓ దమ్మపేట, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రేపు పవర్ కట్
News November 12, 2025
NGKL: ‘దర్శన యాత్ర.. ఫోన్ చేయండి!’

NGKL డిపో నుంచి అన్నవరం, పంచారామ క్షేత్రాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న రాత్రి యాత్ర ప్రారంభం కానుంది. 15న అమరేశ్వరుని దర్శనం, భీమవరం, ద్రాక్షారామం, పంచారామాలు, 16న అన్నవరం వ్రతాలు, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. 17న తిరుగు ప్రయాణం. ఛార్జీ రూ.3,000. వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలని అన్నారు.
News November 12, 2025
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

డుంబ్రిగూడ మండలం కురిడి వద్ద బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద యువకుడు నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


