News November 12, 2025
జంక్షన్ల అభివృద్ధి పనులను వెంటనే మొదలు పెట్టండి: మేయర్

జంక్షన్ల అభివృద్ధి పనులను వెంటనే మొదలు పెట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో నూతనంగా ఉర్సుగుట్ట, హన్మకొండ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీ ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బుధవారం మేయర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా ఏర్పాటు చేసేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. పనులను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు.
Similar News
News November 13, 2025
వైద్యురాలిగా రాణించి ప్రజాసేవలో అడుగుపెట్టా: MP కావ్య

రోగి శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా నయం చేయడం వైద్యుడి కర్తవ్యమని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. తాను వైద్యురాలిగా రాణించి, ప్రస్తుతం ప్రజా సేవా మార్గంలో అడుగు పెట్టానని, తెలంగాణలో వైద్య విద్య విస్తరణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఎంపీ సూచించారు.
News November 13, 2025
ప్రకాశం జిల్లాలో 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో బుధవారం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లో గ్రంథాలయాల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
News November 13, 2025
కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


