News November 12, 2025
విశాఖలో ట్రాఫిక్ డైవర్షన్స్

విశాఖలో 14,15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య (CII Summit–2025) సదస్సు నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్‌లు అమలు చేస్తున్నారు. విశాఖ కంటి ఆసుపత్రి జంక్షన్ వద్ద నుంచి శివాజీ పాలెం మీదుగా హైవేకు మార్గం మారుస్తారు. సిరిపురం, టైకూన్, మాస్క్ జంక్షన్‌ల వద్ద సాధారణ వాహనాల రూట్లు మార్చారు. భారీ వాహనాలు ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
Similar News
News November 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 13, 2025
పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.
News November 13, 2025
పెద్దపల్లి: పారామెడికల్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు

సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RGMలో పారామెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నాలజీ కోర్సుల్లో చెరో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. సీట్లు ఖాళీగా ఉంటే ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. వివరాలకు https://tgpmb.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.


