News November 14, 2025

జగిత్యాల: 394 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో మొత్తం 436 వరి కొనుగోలు కేంద్రాలకు 394 కేంద్రాలు ఇదివరకే ప్రారంభం అయ్యాయని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. 56 కోట్ల రూపాయల విలువగల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 28 కోట్ల రూపాయల విలువ వరకు రైతుల వివరాలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రతి మండలానికి, క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు.

Similar News

News November 14, 2025

బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.

News November 14, 2025

అండర్-14 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్ టీం కెప్టెన్‌గా బాపట్ల విద్యార్థి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీం కెప్టెన్‌గా బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఎంపికయ్యాడు. అతని ఎంపిక జిల్లాకు గర్వకారణమని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు రఘునాథ్ తెలిపారు. శుక్రవారం నుంచి నిర్వహించనున్న సెంట్రల్ జోన్ మ్యాచ్ అండర్-14 జోన్ మ్యాచ్‌లో గుంటూరు జిల్లా టీం ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంమోహన్ రావు ఆకాంక్షించారు.

News November 14, 2025

‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్‌ ఓటమి కూడా ఈసారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.