News November 14, 2025

NLG: రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం

image

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రమాదానికి గురైన కారును జాతీయ రహదారి (NH-65) పక్కన ప్రదర్శించారు. దాని పక్కనే, “నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదంతో హోర్డింగ్‌ను ఏర్పాటు చేసి వాహనచోదకులకు కనువిప్పు కలిగించారు.

Similar News

News November 14, 2025

షార్‌లో 141 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

image

సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 14.

News November 14, 2025

ఆగిరిపల్లిలో అర్ధరాత్రి యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

ఆగిరిపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బైకును పాల వ్యాను ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయాలైన మరో వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఎస్ఐ శుభ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

News November 14, 2025

జీడబ్ల్యూఎంసీ బిల్లుల నిలుపుదలపై కాంట్రాక్టర్ల ఆగ్రహం

image

జీడబ్ల్యూఎంసీ పరిధిలో 8 నెలలుగా చేసిన అభివృద్ధి పనుల బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాక అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కమిషనర్, మేయర్, అకౌంట్స్‌ సెక్షన్ చుట్టూ తిరిగినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులపై నిలకడైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రేపటి నుంచి నిరసనలకు దిగనున్నారు.