News November 14, 2025

వీరుడు, సంఘసంస్కర్త పల్నాడు బ్రహ్మనాయుడు

image

11వ శతాబ్దంలోనే కుల మతాలకతీతంగా చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మాచర్ల మహామంత్రి పల్నాడు బ్రహ్మనాయుడు. ఆయన పాలనా, ధర్మ పోరాటం, సమానత్వ సాధనలో మార్గదర్శకుడు. మాల కన్నమదాసును దత్తత తీసుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. మాచర్ల, మార్కాపురం, కారంపూడిలో ఆయన కట్టించిన వైష్ణవాలయాలు నేటికీ ఉన్నాయి. యుద్ధంలో ఓడిపోయినప్పటికీ నాగమ్మను చంపకుండా వదిలివేసి యుద్ధ నీతిని చాటిచెప్పాడు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నల్గొండ వాసుల ఫోకస్

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నల్గొండ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.

News November 14, 2025

కరీంనగర్: ‘సర్కార్ దవాఖానాలో స్కాం నిజమే’

image

KNR జనరల్ హాస్పిటల్‌లో <<18278730>>రూ.4.5 కోట్ల స్కాం <<>>జరిగింది వాస్తవమేనని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వైద్య విధాన పరిషత్ స్టేట్ ప్రోగ్రాం, అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్లు, 2 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులతోపాటు అసిస్టెంట్ ఫైనాన్స్ అధికారితో కూడిన బృందాలు జిల్లాసుపత్రిలో విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికను కమిషనర్‌కు ఇవ్వనున్నారు.

News November 14, 2025

వరంగల్ విభజన ఏళ్లైనా గందరగోళమే!

image

జిల్లాల పునర్విభజన జరిగినప్పటి నుంచి దాదాపు ఏళ్లు గడిచినా ఉమ్మడి WGL జిల్లా విభజనతో వచ్చిన అయోమయం ఇంకా తొలగలేదు. పరిపాలన సౌలభ్యం పేరుతో అప్పటి ప్రభుత్వం చారిత్రక WGLను ఆరు జిల్లాలుగా చీల్చి, WGL నగరాన్నే HNK-WGLగా రెండు ముక్కలు చేసింది. రెండు పట్టణాలు కలిసే ఉన్నప్పటికీ, రెండు కలెక్టరేట్లు ఏర్పాటు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అధికారిక పత్రాల్లో WGL అర్బన్, రూరల్ జిల్లాలుగానే ఉన్నాయి.