News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 14, 2025

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

image

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.

News November 14, 2025

అక్షరాలతో నెహ్రూ చిత్రం

image

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలోని ముఖ్య అంశాలను అక్షరాల రూపంలో నింపుతూ రూపొందించిన ఆయన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. సిర్గాపూర్‌లోని ఎస్‌టీ బాలికల గురుకులం అధ్యాపకురాలు శ్రావణి, ఆమె భర్త విజయరాఘవన్ అక్షరాలతో ఈ అద్భుతమైన ఆకారం బొమ్మను రూపొందించారు. నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.