News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

image

జూబ్లీహిల్స్‌లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్‌ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.

Similar News

News November 14, 2025

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

image

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.

News November 14, 2025

అక్షరాలతో నెహ్రూ చిత్రం

image

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలోని ముఖ్య అంశాలను అక్షరాల రూపంలో నింపుతూ రూపొందించిన ఆయన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. సిర్గాపూర్‌లోని ఎస్‌టీ బాలికల గురుకులం అధ్యాపకురాలు శ్రావణి, ఆమె భర్త విజయరాఘవన్ అక్షరాలతో ఈ అద్భుతమైన ఆకారం బొమ్మను రూపొందించారు. నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.