News November 14, 2025
జూబ్లీ బైపోల్: కౌంటింగ్ హాల్లోకి వీరికి మాత్రమే అనుమతి

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు అవుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ హాల్‌కు చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు.
SHARE IT
Similar News
News November 14, 2025
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.
News November 14, 2025
అక్షరాలతో నెహ్రూ చిత్రం

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలోని ముఖ్య అంశాలను అక్షరాల రూపంలో నింపుతూ రూపొందించిన ఆయన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. సిర్గాపూర్‌లోని ఎస్‌టీ బాలికల గురుకులం అధ్యాపకురాలు శ్రావణి, ఆమె భర్త విజయరాఘవన్ అక్షరాలతో ఈ అద్భుతమైన ఆకారం బొమ్మను రూపొందించారు. నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


