News November 14, 2025

250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

కేబినెట్ సెక్రటేరియట్ 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, MScతో పాటు GATE ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NOV 15 నుంచి DEC 14 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.

News November 14, 2025

ఒక రౌండ్ అంటే ఏమిటి?

image

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్‌ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్‌పై ఒక EVM ఉంటుంది.

News November 14, 2025

అలసంద సాగు..అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇదే

image

అలసంద 85 నుంచి 90 రోజుల పంట. దీనికి చల్కా, ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం. అన్ని కాలాల్లో విత్తుటకు టి.పి.టి.సి-29 అనే విత్తన రకం అనుకూలం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా థైరమ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తాలి. వరుసకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకోవాలి.