News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News November 14, 2025

MGB సీఎం అభ్యర్థి తేజస్వీ వెనుకంజ

image

ఆర్జేడీ కీలక నేత, MGB సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి పోటీ చేసిన ఆయన 3,000 ఓట్లతో వెనుకపడ్డారు. 4వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌కు 17,599 ఓట్లు రాగా, తేజస్వీకి 14,583 ఓట్లు వచ్చాయి. ఇంకా 26 రౌండ్లు ఉన్నాయి.

News November 14, 2025

నెల్లూరు: KG మటన్ రూ.500.. బారులు తీరిన జనాలు

image

ఆఫర్స్ పెట్టీ కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే నెల్లూరులోని బీవీ నగర్‌లో జరిగింది. ఓ మటన్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కిలో మటన్ 500 రూపాయలే అని బోర్డ్ పెట్టడంతో చుట్టు పక్కల జనాలు అందరూ బారులు తీరారు. మార్కెట్‌లో 1000 రూపాయలకు దొరికే మటన్ రూ.500కి వస్తుండటంతో ఆ షాప్ వద్దకు జనాలు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం కాస్త రద్దీగా మారింది.

News November 14, 2025

15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.