News November 14, 2025

ఒంటరిగా వెళుతున్న ఎంపీ.. కలిసిరాని ఎమ్మెల్యేలు!

image

కాకినాడ MP ఉదయ శ్రీనివాస్ జిల్లాలో ఒంటరిగానే పర్యటనలకు వెళ్తున్నారు. కాకినాడ(R)లో జనసేన MLA ఉన్నప్పటికీ ఆయన కూడా ఎంపీతో కలవడం లేదట. పిఠాపురంలో మాజీ MLA దొరబాబు మాత్రమే MP వెంట వస్తున్నారు. మాజీ MLA వర్మ, సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో ఈయనకు విభేదాలున్నాయి. మిగతా చోట్ల కూడా MLAలు సహకరించడం లేదని, MP కూడా కలుపుగోలుతనంగా ఉండరనే టాక్ ఉంది. దీంతో MP నిధులతో చేపట్టే పనులకు ఆయనే శంకుస్థాపనలు చేసుకుంటున్నారు.

Similar News

News November 14, 2025

బీటెక్ పాసైన వారికి 250 ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష!

image

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఎస్సీతో పాటు GATE పాసైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లకు మించకూడదు. కంప్యూటర్ సైన్స్/ఐటీ, డేటా సైన్స్/ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ తదితర విభాగాల్లో వెకెన్సీస్ ఉన్నాయి. జీతం నెలకు రూ.44,900-1,42,400. త్వరలో స్వీకరణ తేదీ వెల్లడించనున్నారు. చివరి తేదీ DEC 14.

News November 14, 2025

రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

image

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

News November 14, 2025

దూసుకెళ్తున్న నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆయన 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది.