News November 14, 2025

ఒక రౌండ్ అంటే ఏమిటి?

image

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్‌ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్‌పై ఒక EVM ఉంటుంది.

Similar News

News November 14, 2025

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

image

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.

News November 14, 2025

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..

image

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీయే నమోదు చేస్తోంది. ఎన్డీయే 130-160 సీట్ల వరకు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. కానీ వాటన్నింటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 70-100 గెలుస్తుందన్న సర్వేల అంచనాలు నిజం కాలేదు. ఎంజీబీ కేవలం 50 లోపు సీట్లలోనే లీడ్‌లో ఉండటం గమనార్హం.

News November 14, 2025

200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుంది: CBN

image

AP: బిహార్‌లో ఎన్డీయే ఘ‌న విజ‌యం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ CII పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుందని అన్నారు. ప్ర‌జ‌లంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంత‌లా ప్ర‌జా న‌మ్మ‌కం పొందిన వ్య‌క్తి మోదీ త‌ప్ప మ‌రెవ‌రూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం న‌రేంద్ర మోదీది అని కొనియాడారు.