News November 14, 2025

అక్షరాలతో నెహ్రూ చిత్రం

image

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలోని ముఖ్య అంశాలను అక్షరాల రూపంలో నింపుతూ రూపొందించిన ఆయన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. సిర్గాపూర్‌లోని ఎస్‌టీ బాలికల గురుకులం అధ్యాపకురాలు శ్రావణి, ఆమె భర్త విజయరాఘవన్ అక్షరాలతో ఈ అద్భుతమైన ఆకారం బొమ్మను రూపొందించారు. నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.

News November 14, 2025

రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

image

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News November 14, 2025

స్వచ్ఛతా అవార్డు అందుకున్న సింగరేణి C&MD

image

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరాం అత్యుత్తమ స్వచ్ఛతా కంపెనీ అవార్డును అందుకున్నారు. సంస్థ అధికారులు, ఉద్యోగులను C&MD ఈ సందర్భంగా అభినందించారు.