News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.

Similar News

News November 14, 2025

రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

image

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News November 14, 2025

‘కాంత’ సినిమా రివ్యూ&రేటింగ్

image

ఓ దర్శకుడు, హీరోకి మధ్య విభేదాలతో పాటు ఓ హత్య చుట్టూ జరిగే కథే ‘కాంత’. 1950 కాలం నాటి సినీ లోకాన్ని స్క్రీన్‌పై చూపించారు. సెట్స్, కార్లు, కెమెరాలు, లొకేషన్స్, గెటప్‌లు కొంత మేరకు ఆకట్టుకుంటాయి. మహానటి సినిమాను గుర్తుచేస్తాయి. దుల్కర్, సముద్రఖని, రానా నటన మెప్పిస్తుంది. సాగదీతగా సాగే స్క్రీన్‌ప్లే, స్టోరీకి కనెక్ట్ కాకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. రేటింగ్: 2.5/5.

News November 14, 2025

బిహార్ రిజల్ట్: కాంగ్రెస్ కుదేలు

image

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. 55 స్థానాల్లో వెనుకబడింది. మరోవైపు MGB మిత్రపక్షం CPI(ML) Liberation 20 సీట్లలోనే పోటీ చేసినా 7 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్లే గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన RJD 32 చోట్ల లీడ్‌లో ఉంది.