News November 14, 2025
నేను టీటీడీ ఉద్యోగిని కాను: రవి కుమార్

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ, రవికుమార్ ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీతో విచారణ చేయాలనే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రవికుమార్ వాజ్యం వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరకామణి వ్యవహారంలో సుమోటో వ్యాజ్యంను మేమే విచారిస్తామని సీజే బెంచ్ తెలిపింది. అయితే నేను టీటీడీ ఉద్యోగిని కాను, నిర్వచనం పరిధిలోకి రాను, ఏసీబీ విచారణ ఆపాలని కోరారు.
Similar News
News November 14, 2025
NZB: ఇది ప్రజా విజయం: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం అయినా నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసముంచి తమ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతమని అభివర్ణించారు.
News November 14, 2025
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 14, 2025
యూనివర్సిటీ ఆఫ్ HYDలో JRF పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ JRFపోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE/CSIR/UGC-NET అర్హత సాధించి ఉండాలి. లైఫ్‌సైన్స్‌లో JRFకు ఈ నెల 20 ఆఖరు తేదీ కాగా, అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఓషియన్,మెటియోరాలజీ, ఫిజికల్ ఓషనోగ్రఫీ, జియాలజీ విభాగంలో JRFకు ఈ నెల 27 ఆఖరు తేదీ.


