News November 14, 2025
నువ్వుల నూనెతో జుట్టు సమస్యలు దూరం

జుట్టు ఆరోగ్యానికి నువ్వుల నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు రాలడాన్ని, పొడిబారడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టు నల్లగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు.
Similar News
News November 14, 2025
3వ స్థానంతో మ్యూజికల్ చైర్ మంచిది కాదు: ఆకాశ్ చోప్రా

బ్యాటింగ్ లైనప్‌లో 3వ స్థానంతో మ్యూజికల్ చైర్ ఆడటం మంచిది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ‘క్రీడాకారులను రెడీ చేయడంలో తప్పు లేదు. ఇంతకుముందు కరుణ్‌నాయర్, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ తర్వాత అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తారా? విపరీతమైన ప్రయోగాలు చేయడం సరైనది కాదు’ అని పేర్కొన్నారు. రాహుల్ ద్రవిడ్, కోహ్లీ, పుజారా తర్వాత 3వ స్థానంలో సరైన బ్యాటర్‌ను టీమిండియా కనుక్కోలేదు.
News November 14, 2025
ప్రీక్లాంప్సియా లక్షణాలు

ప్రీక్లాంప్సియా గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్య. ఇది హైబీపీతో ప్రారంభమై, ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ప్రీక్లాంప్సియా ఉన్న గర్భిణుల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, ముఖం వాపు, తలనొప్పి, మసక మసకగా కనిపించడం, కంటిలో నల్లటి మచ్చలు, కడుపులో కుడివైపునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటివి. ప్రెగ్నెన్సీలో ఒత్తిడికి దూరంగా ఉంటూ, రక్తప్రసరణ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News November 14, 2025
బెంగాల్, UPలో ఈ గేమ్ సాగదు: అఖిలేశ్ యాదవ్

బిహార్‌లో SIR పేరుతో ఆడిన గేమ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ, ఇతర రాష్ట్రాల్లో ఇకపై సాగదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎన్నికల కుట్ర బయటపడిందని ఆరోపించారు. ‘వాళ్ల ఆటలు సాగనివ్వం. అలర్ట్‌గా ఉంటాం. బీజేపీ చర్యలను అడ్డుకుంటాం. బీజేపీ అంటే పార్టీ కాదు.. మోసం’ అని ట్వీట్ చేశారు. కాగా బిహార్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది.


