News November 14, 2025
రానున్న 10 ఏళ్లలో APలో ₹1 ట్రిలియన్ పెట్టుబడి: కరణ్ అదానీ

APలో రానున్న పదేళ్లలో ₹1 ట్రిలియన్ పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూప్ MD కరణ్ అదానీ తెలిపారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మాట్లాడుతూ పోర్టులు, సిమెంటు, డేటా సెంటర్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఇన్వెస్టు చేస్తామన్నారు. $15 Bతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు.
Similar News
News November 14, 2025
అసమ్మతి నేతలను సైలెంట్ మోడ్‌లోకి నెట్టిన రేవంత్

TG: కాంగ్రెస్‌లో గ్రూపు వివాదాలు సాధారణం. ప్రాధాన్యం లేక నిరాశతో ఉన్న సీనియర్లు CM రేవంత్‌పై పలుమార్లు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో ఓటమి పాలైతే రేవంతే దీనికి కారణమని బలంగా ఫిర్యాదు చేయొచ్చని వారు భావించారు. కానీ పార్టీ గెలుపుతో నిరాశే ఎదురైంది. పక్కా ప్రణాళికతో సీనియర్లను CM సైలెంట్ మోడ్‌లోకి నెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 14, 2025
సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్: బీజేపీ సెటైర్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలపడటంపై BJP సెటైర్లు వేసింది. ఎన్నికల ఓటములకు చిహ్నంగా రాహుల్ మారారని విమర్శించింది. 2004 నుంచి ఇప్పటిదాకా 95 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఓ మ్యాప్‌ను షేర్ చేసింది. సెంచరీకి 5 ఓటముల దూరంలో ఉన్నారని ఎద్దేవా చేసింది. ‘మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. మొత్తం రాహుల్‌కే వస్తాయి’ అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
News November 14, 2025
NHIDCLలో ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NHIDCL) 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్స్ మెయిన్స్- 2024 రాసి ఇంటర్వ్యూకు ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/


