News November 14, 2025

మంచిర్యాల: ‘శబరికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’

image

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల నుంచి శబరి కి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కేరళ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ పార్టీ నాయకులు కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ను కలిసి వినతిపత్రం అందజేశారు. చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి రాజస్థాన్ వరకు నడుస్తున్న రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీ బైపోల్: కాంగ్రెస్‌ LEADను టచ్ చేయని BJP!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ శ్రేణులను నిరాశలో పడేశాయి. పోస్టల్ బ్యాలెట్‌లో 20 ఓట్లు రాగా.. 10 రౌండ్లు ముగిసేసరికి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. మొత్తం పోలైన ఓట్లలో 8.76 శాతంతో 17,061 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 50.83 శాతంతో 98,988 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి మీద 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. కనీసం INC LEAD ఓట్లు కూడా BJPకి రాకపోవడం గమనార్హం.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో BRSకు తగ్గిన ఓట్లు!

image

గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే BRSకు ఈసారి ఓట్లు తగ్గాయి. 2014లో అప్పటి TRS అభ్యర్థి రాములు ముదిరాజ్‌కు 18,436 ఓట్లు రాగా 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 68,979 ఓట్లు వచ్చాయి. 2023లో BRSఅభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,550 ఓట్లు రాగా ఈ ఉపఎన్నికలో మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికతో పోల్చితే 6,291 ఓట్లు తక్కువగా వచ్చాయి. మైనార్టీలు కాంగ్రెస్ వైపు మళ్లడమే ప్రధాన కారణమని టాక్.