News November 14, 2025

₹11,399 కోట్లతో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధి

image

TG: హ్యామ్ విధానంలో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ₹11,399.33 కోట్లతో 5824 KM మేర రహదారులను తీర్చిదిద్దనుంది. ఫేజ్1లో నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, కుమరంభీం జిల్లాల్లోని 30 రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులిచ్చింది. కాగా గతంలో అనుమతులిచ్చిన 7 రోడ్లను ఫేజ్1 నుంచి తొలగించి కొత్తవి చేర్చారు. GO విడుదలతో టెండర్లు పిలవనున్నారు.

Similar News

News November 14, 2025

చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్‌లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.

News November 14, 2025

చిరాగ్ పాస్వాన్: పడి లేచిన కెరటం!

image

సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు LJP అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకేఒక స్థానంలో గెలిచారు. బాబాయ్‌తో వివాదాలు, 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 5 చోట్లా గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.

News November 14, 2025

భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

image

డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్(DIO) 7 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, B.Tech, BE, MSc, ME, M.Tech, MBA/PGDM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ ప్రోగ్రామ్ డైరెక్టర్‌కు నెలకు రూ.1,40,000-1,80,000, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.80,000-రూ.1,20,000, DPEకు రూ.40,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: idex.gov.in/