News November 14, 2025
బిహార్ రిజల్ట్: కాంగ్రెస్ కుదేలు

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. 55 స్థానాల్లో వెనుకబడింది. మరోవైపు MGB మిత్రపక్షం CPI(ML) Liberation 20 సీట్లలోనే పోటీ చేసినా 7 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్లే గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన RJD 32 చోట్ల లీడ్‌లో ఉంది.
Similar News
News November 14, 2025
వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.
News November 14, 2025
కమలం జోరు.. కాంగ్రెస్ బేజారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP దూసుకెళ్తోంది. JDUతో కలిసి బరిలోకి దిగిన కాషాయ పార్టీ 95 సీట్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ 74 స్థానాలు గెలవగా ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. అటు ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ బోల్తా పడింది. కేవలం 3 చోట్లే ఆధిక్యంలో ఉంది. గత ఎలక్షన్స్‌లో హస్తం పార్టీ 19 సీట్లు గెలవగా ఇప్పుడు మరింత దిగజారింది.
News November 14, 2025
చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్‌లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.


