News November 14, 2025
నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీ నివాళి..

దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులర్పించారు. బాలల హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని SP హామీ ఇచ్చారు.
Similar News
News November 14, 2025
వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.
News November 14, 2025
WNP: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. వనపర్తిలోని నాగవరం (10వ వార్డు)లో రిన్సీ మినీస్త్రీ సొసైటీ అధ్యక్షుడు గంధం బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సాహితీ వేతలు, నారాయణరెడ్డి, బుచ్చయ్య, వీరాచారి, సత్తార్, నిరంజనయ్య తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
HYD: BRSకు కలిసిరాని సింపతి!

జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ సింపతిని నమ్ముకున్న BRSకు కలిసిరాలేదు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లాస్య నివేదితను నిలబెట్టారు. అక్కడ కూడా సానుభూతి ఓట్లు రాల్చలేదు. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గోపినాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్‌లో BRS అధిష్ఠానం ఆ కుటుంబానికే టికెట్ కేటాయించింది. ఇక్కడ మెజార్టీ ప్రజలు సింపతిని ఆదరించలేదు. దీంతో సునీత ఓటమి చవిచూశారు.


